Wednesday, April 2, 2025
HomeMovie Newsఘనంగా జరిగిన లవ్ యువర్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్! ఏప్రిల్ 4న విడుదల!

ఘనంగా జరిగిన లవ్ యువర్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్! ఏప్రిల్ 4న విడుదల!

దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా MLA మల్లా రెడ్డి గారు వచ్చారు.

- Advertisement -

ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లా రెడ్డి గారు ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండని కోరారు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేదని, ఆయన నటించకపోవడం వల్ల పాన్ ఇండియా సినిమా అయ్యిందని అన్నారు. అలాగే శ్రీ హర్ష ఈ సందర్బంగా తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటాననని అన్నారు. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. అలాగే సింగర్ SP చరణ్, నటుడు ప్రవీణ్ తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అలాగే ఈ సినిమాలో తనతో పని చేసిన కో స్టార్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనని, తన సినిమాని ఆదరించాలని, తనని ఎల్లప్పుడూ దీవించాలని ప్రేక్షకులను శ్రీ హర్ష కోరారు.

ఇక MLA మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ.. ముందుగా ప్రేక్షకులకు నమస్కారాలు తెలిపారు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారని అన్నారు. హీరోయిన్ కషిక కపూర్ మంచి కసి కసిగా బాగుందని సరదాగా అన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్ అని, వాళ్ళ తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్ అని, వీళ్ళు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజుని ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ కోసం తాను అసెంబ్లీ పనులు మానుకొని మరీ వచ్చానన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పాన్ ఇండియా హిట్ చెయ్యాలని MLA మల్లా రెడ్డి కోరారు.

ఇక డైరెక్టర్ పవన్ గారు మాట్లాడుతూ.. తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చరణ్ గారు ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. బాల సుబ్రహ్మణ్యం గారు చరణ్ గారిని మనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. బాల సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా కూడా చరణ్ గారిని, మమ్మల్ని దీవిస్తూ ఉంటారని అన్నారు. సినిమాలో చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేశానని అన్నారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయిందని అన్నారు. చరణ్ గారు ఇచ్చిన కోపరేషన్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అన్నారు. అలాగే నటుడు ప్రవీణ్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రఘుబాబు, ఇతర నటి నటులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సినిమాకి పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ శ్యామ్ గారు, మణి శర్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తో పని చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఇక సింగర్ SP చరణ్ మాట్లాడుతూ.. వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం తెలిపారు. అలాగే ఈ సినిమాని హిట్ చేయబోతున్న ప్రేక్షకులకు నమస్కారం తెలిపారు. తన క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజు గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతలు రామస్వామి రెడ్డి గారికి, కిషోర్ రాఠీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరో శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారని, వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాతో శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి థాంక్స్ చెప్పారు. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ లో ప్రవీణ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్టేజిపై చక్కగా పాట పాడారు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా అన్నారు.

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. LYF సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. మణి శర్మ గారికి, SP చరణ్ గారికి ఇంకా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. పవన్ సినిమాని చాలా బాగా తీశారని, ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ (లవ్ యువర్ ఫాదర్)

నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీ చరణ్, కేశిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై లి
నిర్మాతలు : కిషోర్ రాతి, మహేష్ రాతి, ఏ సామ్రాజ్యం, ఏ చేతన్ సాయిరెడ్డి,
ఆర్ట్ శంకర్ : చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మెయిన్
ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు వి ఆర్

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read