తాజాగా విడుదలైన “LYF – Love Your Father” మూవీ ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. చూస్తుంటే తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఏప్రిల్ 4న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే దృష్టిని ఆకర్షించింది.
ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబట్టిన LYF ట్రైలర్ రాజకీయ నాయకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా LYF సినిమా ట్రైలర్ ని ఫేమస్ పొలిటికల్ లీడర్, BJP నేత అయిన శ్రీ కిషన్ రెడ్డి గారు చూడటం జరిగింది. ఈ ట్రైలర్ ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మూవీ టీం మొత్తాన్ని అభినందించారు. ట్రైలర్ చాలా బాగుందని ముఖ్యంగా అందులోని కాశీ విజువల్స్ తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ట్రైలర్ వీక్షించిన కిషన్ రెడ్డి గారు కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని కొనియాడారు. LYF ట్రైలర్ కి ఎంతగానో ఆకర్షితులైన కిషన్ రెడ్డి గారు ఈ సినిమా ఫస్ట్ టికెట్ ని కొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మూవీ టీం అందరికీ తన బెస్ట్ విశేష్ తెలిపారు.