Tuesday, October 22, 2024
HomeMovie News'లక్కీ భాస్కర్' ట్రైలర్ విడుదల

‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ విడుదల

- Advertisement -

స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమా తెరకెక్కించారు. సృష్టిలో ధనం అన్నింటికంటే విలువైందనే కాన్సెప్ట్​తో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా ఈ నెల 31న సినిమా వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు.

బ్యాంకింగ్ సెక్టార్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే మనిషి జీవితంలో డబ్బు ప్రాధాన్యత ఎంతటిదో తెలియజేస్తుంది. ఆరు వేల జీతంతో కుటుంబాన్ని పోషించే భాస్కర్‌ కోట్లకు ఎలా పడగలెత్తాడు అనే విషయాన్ని ఆస్తక్తిగా, ఉత్కంఠగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కథను ట్రైలర్‌లో తెలియజేశారు. కాలిగోటి నుంచి తల వరకు ఏమి కావాలో కొనుక్కో… అంటూ దుల్కార్, మీనాక్షితో చెప్పే సంభాషణతో పాటు జూదంలో ఎంత గొప్పగా ఆడామో కాదో.. ఎక్కడ ఆపామో ముఖ్యం!… సిగరెట్‌, ఆల్కహాల్‌ కన్నా డబ్బు ఇచ్చే కిక్‌ ఎక్కువ లాంటి డైలాగులు ఈ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read