Wednesday, March 12, 2025
HomeMovie Newsవీర ధీర సూరన్ పార్ట్ 2 నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్

వీర ధీర సూరన్ పార్ట్ 2 నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్

చియాన్ విక్రమ్ మోఎస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు.

- Advertisement -

H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్  పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస రెస్పాన్స్ వచ్చింది.  

ఈ రోజు మేకర్స్ కళ్లల్లో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు.

శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ తమ ప్లజెంట్ వోకల్స్ మెలోడీ అండ్ గ్రేస్ ని మరింత ఎలివేట్ చేశారు. రాజేష్ గోపిశెట్టి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. ఈ సాంగ్ లో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వుంది. ఈ లవ్ ట్రాక్ ఇన్స్టంట్ హిట్ గా  నిలిచింది.

ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.

చియాన్ విక్రమ్-దర్శకుడు S.U. అరుణ్ కుమార్-నిర్మాత రియా శిబుల అద్భుతమైన అద్భుతమైన కొలాబరేషన్ లో వస్తున్న వీర ధీర సూరన్ పార్ట్ 2 పై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులలో చాలా అంచనాలు వున్నాయి.  తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read