-తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రేమరాజ్
‘సినిమా రంగంలో తెలంగాణ యూనియన్లు ఎందుకు పెట్టారు’ అని ప్రశ్నించిన తమ్మారెడ్డి భరద్వాజ తన మాటల్ని వెనక్కి తీసుకుంటూ విచారం వ్యక్తం చేసినందున ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నట్టు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమ్ రాజ్ తెలిపారు.
ఎప్పటిలాగే ఇండస్ట్రీలో అందరం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి పనిచేసుకుందామని ఆయన అన్నారు. అలాగే కరోనా ఆపత్కాల సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ(ccc) ద్వారా తెలంగాణ యూనియన్లలోని కార్మికుల్ని ఆదుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవికి, కమిటీ పెద్దలకు ఎంతగానో రుణపడి ఉన్నామని ఆయన తెలిపారు. తెలంగాణ కార్మికులను ccc తరఫున ఆదుకునే విషయంలో రేయింబవళ్లు ఎంతో కృషి చేసిన N.శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ప్రేమ్ రాజ్ తెలిపారు.
ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తేసి షూటింగులకు అనుమతులు ఇచ్చే అవకాశం లేనందున రెండో విడత సాయంలోనూ తెలంగాణ యూనియన్లకు సహాయం కొనసాగించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసారు!!