లీగల్లీ వీర్ విహారం.లీగల్లీ వీర్ చిత్రంలో జయశ్రీ రాచకొండ పోషించిన జడ్జి పాత్రకు విశేష స్పందన.మొన్న శుక్రవారం విడుదలైన “లీగల్లీ వీర్” చిత్రంలో తను పోషించిన జడ్జి పాత్రకు విశేషమైన స్పందన లభిస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు రైజింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయశ్రీ రాచకొండ. స్వతహా తాను లాయర్ కావడం.. చిత్ర దర్శకుడు రవి గోగులకు స్క్రిప్ట్ పై మంచి గ్రిప్ ఉండడం… ఈ జడ్జి క్యారెక్టర్ బాగా రావడానికి కారణాలని ఆమె పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు వీర్ రెడ్డితోపాటు చిత్రబృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన “లక్కీ భాస్కర్”లోనూ భాగస్వామి అయిన జయశ్రీ… సినిమాలతోపాటు వెబ్ సిరీస్, యాడ్ ఫిలిమ్స్ తో బిజీగా ఉన్నారు!!