Monday, December 23, 2024
HomeMovie Newsహీరో రాజ్ తరుణ్ ఫై పోలీస్ కేసు..

హీరో రాజ్ తరుణ్ ఫై పోలీస్ కేసు..

- Advertisement -

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న అతడిపై లావణ్య అనే ఓ యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించడం సంచలనం అవుతోంది.

లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ’11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. గతంలోనే మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ, తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు. అంతేకాదు, అతడు మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు’ అని పేర్కొంది.

‘రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంత మంది బెదిరిస్తున్నారు. గతంలో కూడా నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అప్పుడు నేను అరెస్టై 45 రోజులు పాటు జైల్లో ఉన్నాను. కానీ, ఆ పరిస్థితుల్లో కూడా రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘రాజ్ తరుణ్ నన్ను ప్రేమించానని నమ్మించాడు. అందుకే శరీరకంగా వాడుకున్నాడు. కానీ, ఇప్పుడు మాత్రం వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం.. తను నాకు కావాలి’ అంటూ పిర్యాదు లో పేర్కొంది.

లావణ్య పిర్యాదు ఫై రాజ్ తరుణ్ స్పందించారు. “నేను ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్న మాట నిజం. 2014 నుంచి 2017 వరకూ మేము రిలేషన్‌లో ఉన్నాం. కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి నుంచి నన్ను లావణ్య బెదిరిస్తూ వస్తుంది. తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం కూడా మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని లేదంటే మీడియాలో రచ్చ చేస్తానంటూ నన్ను ఎప్పటి నుంచో బ్లాక్ మెయిల్ చేస్తుంది. అనవసరంగా ఎందుకు పరువు పోతుందనే భయంతోనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాను. నా విషయంలోనే కాదు ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోలు వాళ్ల ఫాదర్‌కి పంపించి కూడా ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. డ్రగ్స్‌కి అలవాటు పడి ఆమె చెత్త పనుల చేయడంతో నేను భరించలేక దూరం పెట్టాను. సెలబ్రెటీ అనే వాడిపై ప్రూఫ్ లు ఎవరూ పట్టించుకోరు.. ఆరోపణలు వస్తే నమ్మేస్తారు. అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటుంది అనే భయపడ్డాను. నాకు మందు, సిగరెట్లు అలవాటు ఉంది కానీ డ్రగ్స్ ఎప్పుడూ ముట్టుకోలేదు.” అంటూ రాజ్ తరుణ్ చెప్పారు.

షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో లావణ్య నాకు పరిచయం అయింది. అప్పుడు తను చాలా మంచిగా ఉండేది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ కృతజ్ఞత ఉంది కనుకే ఇన్నాళ్లూ ఏం చేసినా భరించాను. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్‌లో కూడా ఉంది. మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది. నా విల్లాలో నేను కింద ఫ్లోర్‌లో ఉంటే వాళ్లిద్దరూ పై ఫ్లోర్‌లో కలిసి ఉండేవారు. ఆ తర్వాత మస్తాన్ సాయి.. లావణ్యపై దాడి కూడా చేశాడు. అప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయిపై లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. గత 7 ఏళ్లుగా నాకూ లావణ్యకి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఆమెపై డ్రగ్స్ కేసు పెట్టారని తెలిసినప్పుడే ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేశాను. ఇప్పటివరకూ ఆమె అడిగినప్పుడల్లా నేను డబ్బులిచ్చాను. ఈ మధ్య ఇక ఇవ్వనని చెప్పడంతోనే ఈ కంప్లెయింట్ చేసింది. ఇక నాకు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌తో ఎఫైర్ ఉంది అని అబద్ధాలు చెబుతుంది. నేను ఉండేది హైదరాబాద్‌లో ఆవిడ ఉండేది ముంబైలో మరి ఇద్దరం సహజీవనం ఎలా చేస్తాం.” అంటూ రాజ్ తరుణ్ అన్నారు. మరి వీరిలో ఎవరిది నిజం అనేది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read