Saturday, June 7, 2025
HomeMovie News‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది

‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త పాట యాడ్‌ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్ తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్‌ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

- Advertisement -

ప్రెస్ మీట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా రీరిలీజ్ ని  లైఫ్ లో మర్చిపోలేను. 21 ఏళ్ల తర్వాత ‘లక్ష్మీ నరసింహా’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నానంటే నందమూరి అభిమానులకు ఏదో ఒక స్పెషల్,  సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎలాంటి సర్ ప్రైజ్ అని ఆలోచన వచ్చినప్పుడు.. ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ చేశాం. ఒక సాంగ్ ని షూట్ చేసాంగాని సినిమాలో లేదు. ఆ సాంగ్ ని ఎలాగైనా రి రిలీజ్ లో యాడ్ చేయాలి అని ఆలోచన వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్ లో నెగిటివ్ దొరికింది. కానీ సౌండ్ దొరకలేదు సౌండ్ లేదు. ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, తర్వాత డైరెక్టర్ గారికి, బీమ్స్ కి పంపించాను. వాయిస్, లిరిక్ రాసి రికార్డు చేయాలని చెప్పాను. బోస్ గారు ఇది ఎలా పాజిబుల్ అన్నారు. చేస్తేనే పాజిబుల్ అవుతుందని చెప్పాను. ఒకసారి ప్రయత్నించమని చెప్పాను. అయితే ఈ ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు. ఈ పాటని డిస్ట్రిబ్యూటర్స్ కి వినిపిస్తే పాట అద్భుతంగా ఉంది కొత్త సినిమాల్లో పెట్టండి బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరి అభిమానులు ఈ సినిమాని ఈ సినిమాని మళ్లీ మళ్లీ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను. బాలయ్య బాబు బర్త్ డే కి వస్తుంది. ఇందులో కొత్త సాంగ్ ఉంది. 4k లో చాలా కష్టపడి మౌనిక రెడ్డి,  అభిలాష్ రెడ్డి గారు,  వంశీ ఈ సినిమాని రెడీ చేశారు. నేనప్పుడు తీసిన దాని కంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనిపిస్తుంది. జయంతి అప్పుడు ఇప్పుడు ఒకేలా వున్నారు.  మంచి కథ ఉంటే మళ్లీ సినిమా చేద్దామని చెప్పాను. రీ రిలీజ్ కు ఇంత అద్భుతమైన సాంగ్ ఇచ్చిన భీమ్స్ గారికి, చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

డైరెక్టర్ జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ గారికి థాంక్యూ. ఇలాంటి కొత్త ఐడియాలన్నీ సురేష్ గారికి వస్తాయి.  ఆడియో లేని ఈ సాంగ్ కి ఏదైనా చేద్దామని ఆయన అన్నప్పుడు నేను ఇంపాజిబుల్ అని చెప్పాను. ఆయన, చంద్రబోస్, భీమ్స్ కలిసి ఈ అద్భుతం చేశారు. ఒక ఇంపాజిబుల్ టాస్క్ ని పాజిబుల్ చేసి చూపించారు. ఇళయరాజా గారు ఇలాంటి ఒక ప్రయోగం చేశారని ఎప్పుడో విన్నాను. అయితే అది కూడా ఒక మాంటేజ్ సాంగ్.  కానీ ఒక డాన్స్ బీట్ నెంబర్ కి ఇలా చేయడం అనేది వెరీ వేర్. నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. రామానాయుడు గారు, దత్తు గారు, అరవింద్ గారి తర్వాత ఇండస్ట్రీలో నాలుగో పిల్లర్ సురేష్ గారు. రీ రిలీజ్ లో సినిమాని అందరూ  చూసి ఎంజాయ్ చేయండి. జై బాలయ్య’అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భీమ్స్  కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. తన మాటలు వింటుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. తనకి పాటలు రాయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సురేష్ గారు నన్ను చాలా అభిమానించే నిర్మాత. నా జీవితాన్ని చరితార్థం చేసిన మౌనంగానే ఎదగమని పాటని సురేష్ గారి సినిమాలోనే రాశాను. జయంత్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించే దర్శకుడు. ఇప్పుడు జయంతి గారితో సురేష్ గారితో అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నా 31 ఏళ్ల సినీ సాహిత్య ప్రయాణంలో అతి విచిత్రమైనటువంటి విన్యాసం చేసిన పాట. ముందు ఈ పాటని చిత్రీకరించారు. ఈ పాట స్థానంలో మరో పాటని చిత్రీకరించారు. అది సినిమాలో పెట్టారు. ముందు చిత్రీకరించిన పాట అలానే ఉండిపోయింది.ఈ తరుణంలో ఈ పాటని ఆడియన్స్  కి చూపించాలని ఆలోచన సురేష్ గారికి వచ్చింది. కేవలం విజువల్ మాత్రమే ఉంది. లిప్పు,  డాన్స్ మూమెంట్ మాత్రమే ఉంది. మూమెంట్ ని డీకోడ్ చేసి ట్రాక్ చేయాలి. నేను మొదట ఆ పాట చూడగానే అసాధ్యమనిపించింది. కానీ ఇలాంటి అసాధ్యాన్ని చేస్తే మనం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఒక మధురమైన ఘటనగా నిలిచిపోతుంది అని ఆలోచించి మెల్లమెల్లగా తాళం లయ టెంపో ని డీకోడ్ చేసుకుంటూ వచ్చాను. నేను అలా రాసిన పాటకి ఒక్క అక్షరం కూడా మార్చకుండా ట్యూన్ చేసి అద్భుతంగా పాటని కంపోజ్ చేశాడు బీమ్స్. ఈ పాటని బాలయ్య బాబు అభిమానులు అందరికి అంకితం ఇస్తున్నాం’అన్నారు.  

భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాటకి పనిచేయడం చాలా స్పెషల్. చాలా ఇష్టంగా పని చేశాను. మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయనని మనసులో పెట్టుకుని ఆయనని ప్రేమిస్తూ ఈ పాటకి మ్యూజిక్ చేశాను. ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటాను. చంద్రబోస్ గారితో కలిసి పని చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఆ అవకాశం ఈ పాటతో రావడం అదృష్టంగా భావిస్తున్నాను.  బాలయ్య గారు చంద్రబోస్ గారు, సురేష్ గారు ఇలాంటి గొప్ప వారితో కలిసి ఒక పాట చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను’అన్నారు.

స్వరాగ్ కీర్తన్ మాట్లాడుతూ..  బాలయ్య గారు కి పాట పాడడం నా అదృష్టం.  ఈ అవకాశం ఇచ్చిన భీమ్స్ అన్నకి థాంక్యూ. ఈ పాటని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.

మౌనిక మాట్లాడుతూ.. ఈ సినిమాని రిలీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి థాంక్యూ. భీమ్స్ గారికి చంద్రబోస్ గారికి థాంక్యూ. ఈ సాంగ్ బిగ్ బ్లాస్ట్ కాబోతోంది. ఆడియన్స్, ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read