మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థియేటర్లలో మీరు నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతీ కావాలని డిసైడ్ అయ్యాం. కచ్చితంగా లైలా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతా. లైలా నుంచి నెక్ట్స్ అటక్ పటక్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ నేనే రాశా. అది కూడా మీకు నచ్చుతుంది. ఫిబ్రవరి 14న అందరూ థియేటర్లలో కలుద్దాం.’’ అని చెప్పారు.


అనంతరం మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టీమ్ సమాధానాలిచ్చారు
సినిమా సెన్సార్ అయింది కదా? రిపోర్ట్ ఏం వచ్చింది?
విశ్వక్ సేన్: నేను ఈ సినిమాలో లేడీ గెటప్ వేసింది ఎంటర్‌టైన్ చేయడానికి. మా ఇంటెన్షన్ కేవలం మిమ్మల్ని నవ్వించడమే. అందులో భాగంగానే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. యూత్‌కు పవర్‌ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది.
విశ్వక్ గారూ.. ఈ సినిమాకు సంబంధించి మీకు కష్టమనిపించింది ఏంటి?
విశ్వక్ సేన్: సాయంత్ర పూట ఇంట్లో ఒక్కడినే ఉండడం కష్టం అయింది. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఈ గెటప్‌లో బయటకు వెళ్లడం కుదరలేదు. ఈ గెటప్ కోసం రోజూ రెండు గంటలు పట్టేది.