పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో దుమ్ము లేపుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా రిలీజ్ అయి సినీప్రియుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తుంది.
ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆల్రెడీ మహానటితో ఎంతో నిరూపించుకున్న నాగ్ అశ్విన్ కల్కితో తన దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో చూపిస్తున్నాడు. ఇక థియేటర్ల వద్ద ప్రీమియర్స్ నుండే మూవీ లవర్స్ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అభిమానులకి ఐ ఫీస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. అలాగే విజయ్ దేవరకొండ, రాజమౌళి , వర్మ , సల్మాన్ వంటి స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ తో ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. ఇక సినిమాలో మహాభారత్ ఎపిసోడ్ లో శ్రీ కృష్ణుడి రోల్ చాలా కీలక పాత్ర వహించింది. అయితే ఈ పాత్ర ని ఓ పెద్ద స్టార్ హీరో చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ ఆ ప్రతిష్టాత్మక పాత్రలో నటించిన వారు ఎవరో తెలిసిపోయింది.
కల్కి సినిమాలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడి పాత్రను థియేటర్లలో చూసినపుడు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పాత్రలో శ్రీకృష్ణుడి ముఖాన్ని బహిర్గతం చేయకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ పాత్రని చూసిన పలు హీరోల ఆయా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఆ పాత్రలో ఊహించుకునేలా చేసాడు. కానీ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి పేరు “కృష్ణ కుమార్ బాల సుబ్రహ్మణ్యన్”. బహుశా ఇతను కొత్త నటుడు కావచ్చని అనుకోవచ్చు. కానీ ఇతను ఇంతకు ముందు కూడా పలు సినిమాల్లో నటించాడు. సూర్య హీరో నటించిన “సూరయి పొట్రు” (తెలుగులో ఆకాశమే నీ హద్దు రా) సినిమాలో నటించాడు. ఆ సినిమాలో కృష్ణ కుమార్ సూర్య స్నేహితుడుగా మరియు సహ పైలట్ గా నటించాడు. మొత్తం మీద సినిమాలో అసలైన రహస్యం బయటకు రావడం తో అందరి ఊహాగానాలకు చెక్ పడినట్లు అయ్యింది.