Movie News

కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ ఫై ఫ్యాన్స్ అసంతృప్తి

కిరణ్ అబ్బవరం..ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించి ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే ఆకట్టుకోగా, SR కళ్యాణమండపం అనే సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి రచయితగా తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం, భారీ ప్లాప్ లను అందుకుని డీలా పడ్డాడు. కిరణ్. లాస్ట్ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఓ మోస్తరు హిట్ ని అందుకున్న కిరణ్ మళ్ళీ డిజాస్టర్లు అందుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేయాలనీ చూస్తున్నాడు.

తాజాగా కిరణ్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయగా, కాసేపటికిందే టైటిల్ ని రివీల్ చేసారు మేకర్స్. తన నెక్స్ట్ మూవీ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ముందే రివీల్ చేసిన మేకర్స్ ఈరోజు మూవీ టైటిల్ ని రివీల్ చేయగా, సినిమాకి “క” (KA) అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. కాగా టైటిల్ పోస్టర్ లో బ్యాక్ నుండి కిరణ్ అబ్బవరం ని చూపించగా, క టైటిల్ వెనుక కొన్ని నంబర్లు ఉండగా, అవి అర్ధం కాకుండా ఉన్నాయి. ఇకపోతే అనౌన్స్ చేసిన టైటిల్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ టైటిల్ నిన్ననే రిలీజ్ కావాల్సింది. కానీ ఏవో టెక్నికల్ సమస్య అని చెప్పి ఈరోజు రిలీజ్ చేసారు. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ని చూసి ఈమాత్రం దానికా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.