News

కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా” అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్సర్ థిల్లాన్ నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ, ఏ యూడ్లీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమైంది.

ఈ రోజు హైదరాబాద్ లో “దిల్ రూబా” టీజర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ: మా శివమ్ సెల్యులాయిడ్ సంస్థలో గతంలో ఓ సినిమా చేశాం. నేను డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా కాలంగా ఉన్నాను. కిరణ్ అబ్బవరం నన్ను ఈ కథతో పరిచయం చేశాడు. విశ్వకరుణ్ డైరెక్టర్ అని చెప్పి, అతనితో పరిచయం చేసాడు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. “దిల్ రూబా” టీజర్ మీరు చూసింది కొంత మాత్రమే. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. ఫిబ్రవరిలో సినిమా విడుదలవుతుంది. కిరణ్ అబ్బవరం ను మీరు ఇప్పటి వరకు చూడని విధంగా ఇన్టెన్స్ క్యారెక్టర్‌లో చూడబోతున్నారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ:దిల్ రూబా” కథను కిరణ్ అబ్బవరం గారికి అరగంట పాటు చెప్పాను. ఆయన నచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకో అని పంపారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రతీ అంశంలో కిరణ్ అబ్బవరం గారు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రొడ్యూసర్ రవిగారు 3 సంవత్సరాల నుంచి నా ప్రొడక్షన్ జాబితాలో ఉన్నారు. సారెగమా వారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మా DOP విశ్వాస్‌కు ఈ సినిమా చాలా ఇష్టం. అతను చాలా కష్టపడి అందమైన విజువల్స్ ఇచ్చాడు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ:దిల్ రూబా” గురించి మాట్లాడేముందు, మా ప్రొడక్షన్ హౌస్ సారెగమా వారికి థ్యాంక్స్ చెబుతున్నాను. తెలుగులో వారి ఫస్ట్ మూవీలో నేను హీరోగా నటించడం ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్ రవిగారికి 2019లో పరిచయం అయ్యాను. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విశ్వకరుణ్ మాతో కలిసి పని చేశారు. “దిల్ రూబా” సినిమాలో నా క్యారెక్టర్ సిద్ధార్థ్ చాలా స్పెషల్, ఇన్టెన్స్ గా ఉంటుంది. “సిద్ధు” అనే క్యారెక్టర్ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ విషయంలోనైనా వెనకడుగు వేయడు.దిల్ రూబా సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన ప్రేమను, వ్యక్తిత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అని ఆయన చెప్పారు.