Movie News

‘క’ దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్న కిరణ్ అబ్బవరం

2024 దీపావళి సందర్భంగా విడుదలైన క సినిమా చిన్న బడ్జెట్‌తో చేసినా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం, దర్శకులు మరియు సినిమా టీమ్ పాల్గొన్నారు.

ఇక్కడ, క సినిమా విజయం సాధించడంతో, కిరణ్‌కు తన పారితోషికం పెంచారా? అని మీడియా నుంచి ప్రశ్న వచ్చింది. దీనికి కిరణ్ హాస్యంగా స్పందిస్తూ, “పెంచాలి కదా. ఇన్నిరోజులు కాస్త ఇబ్బందిపడ్డాను. ఇప్పుడు కాస్త పెంచాను. నిర్మాతలు లాభాలు పొందాకే ఆయన నుంచి డబ్బులు తీసుకుంటా. ముందు నిర్మాత సేఫ్ అయ్యాకే నాకు ఎంత అనేది ఆలోచిస్తా” అన్నారు.

కిరణ్ క సినిమా సీక్వెల్ గురించి కూడా మాట్లాడారు. దర్శకులు కంటెంట్ పూర్తి చేసి, ఫైనల్ అయ్యాకే క 2 తెరకెక్కిస్తారని తెలిపారు. ఆ మధ్యలో వేరే సినిమాలు కూడా చేస్తానని కిరణ్ చెప్పారు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది. క సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETv Winలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో చూపించిన అనుభవానికి భిన్నంగా ఈ సినిమా డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌లో ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం ETv Win మూడు వారాల పాటు శ్రమించినట్లు పేర్కొంది.

క సినిమా దర్శకులు సుజీత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అలాగే, తమిళం, మలయాళంలో ఈ సినిమా విడుదలై, క్రిస్మస్ రీిలీజ్ కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.