అందం, ఫ్యాషన్ మరియు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కిమ్ కర్దాషియాన్ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. అమెరికన్ టెలివిజన్ స్టార్ అయిన కిమ్, తన అందం వెనుకున్న సీక్రెట్‌ను బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. కిమ్ కర్దాషియాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చర్మ సౌందర్యానికి సపోర్ట్‌గా సాల్మన్ చేపల వీర్యంతో ఫేషియల్ చేయిస్తానని వెల్లడించింది. ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కిమ్ కర్దాషియాన్ కెరీర్ ప్రారంభం మోడల్‌గా అయినప్పటికీ, “కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్” రియాలిటీ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ షో తన కుటుంబాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసింది. ఆమె ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించాయి. అయితే ఆమె జీవితం వివాదాలతో సైతం నిండిపోయింది. ఆమె వ్యక్తిగత జీవితం, సర్జరీలు, సోషల్ మీడియా పోస్ట్‌లు తరచుగా విమర్శలకు గురవుతాయి.
తాజాగా కిమ్ కర్దాషియాన్ బ్యూటీ టిప్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. సాల్మన్ చేపల వీర్యం నుంచి తయారయ్యే పాలీడియోక్సిరిబోన్యూక్లియోటైడ్స్ అనే పదార్థంతో ఈ ప్రత్యేకమైన ఫేషియల్ చేయించుకుంటానని ఆమె చెప్పింది. ఈ ఫేషియల్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు యవ్వనాన్ని కాపాడుతుందని ఆమె అభిప్రాయపడింది.
సాల్మన్ చేపల వీర్యం కేవలం ఫేషియల్ మాత్రమే కాకుండా, వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేకమైన ఫేషియల్ కోసం 40 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది సెలబ్రిటీలకు ప్రత్యేకించి అందుబాటులో ఉండటంతో కిమ్ వంటి స్టార్లు దీన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ ఫేషియల్‌ను చేయించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.