Wednesday, December 25, 2024
HomeMovie Newsకన్నప్ప టీజర్ వచ్చేస్తుంది..

కన్నప్ప టీజర్ వచ్చేస్తుంది..

- Advertisement -

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మ్కంగా చేస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీ లో బాలీవుడ్ నటి నటులతో పాటు అగ్ర హీరోలు నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాంటి ఈ మూవీ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో సినిమా కు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఈ మూవీ టీజర్​ను జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్​ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో విష్ణు ఎమోషనలయ్యారు. “ఈ చిత్రానికి నా గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా నేను ఉండలేను. జూన్‌ 14న టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది” అంటూ హీరో విష్ణు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read