Tuesday, December 24, 2024
HomeMovie News‘కాంచ‌న 4’ వ‌చ్చేస్తోంది..భయపడడానికి సిద్ధంగా ఉండండి

‘కాంచ‌న 4’ వ‌చ్చేస్తోంది..భయపడడానికి సిద్ధంగా ఉండండి

- Advertisement -

కాంచన ఈ సిరీస్ లో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను భయపెడుతుంటుంది. ఆ రేంజ్ లో రాఘవ యాక్టింగ్ ఉంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుండి మూడు సినిమాలు రాగా..ఇప్పుడు 4 సిరీస్ రాబోతుంది. ఈ మూవీకి కూడా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. తాజాగా ఈ మూవీ కి సంబదించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబ‌ర్‌లో మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే సంవత్సరం వేసవి సెలవల్లో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

2011లో కాంచ‌న విడుద‌లై ఘ‌న విజయాన్ని అందుకుంది. 2015లో రెండో పార్టును రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. 2019లో కాంచ‌న-3ను తీసుకురాగా విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ మూడు పార్టుల్లోనూ రాఘ‌వ లారెన్స్, కోవై సరళల కామెడీ అంద‌రిని అల‌రించింది. ఈ మూవీల్లో రాయ్ ల‌క్ష్మీ, వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు కథానాయికలుగా నటించారు. మ‌రీ కాంచ‌న 4లో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు అన్న విష‌యాల‌ను ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read