Tuesday, December 24, 2024
HomeMovie Newsహాట్ కేకుల్లా అమ్ముడైన కల్కి టికెట్స్

హాట్ కేకుల్లా అమ్ముడైన కల్కి టికెట్స్

- Advertisement -

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో ఉత్తర భారతదేశంలో బుకింగ్స్‌ గ్రాండ్‌గా షురూ అయ్యాయి.

మిడ్‌ వీక్‌లో విడుదలవుతున్నప్పటికీ కల్కి 2898 ఏడీ బుకింగ్స్ మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఈ మూవీ నేషనల్‌ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్‌ సుమారు 13 వేలకుపైగా అమ్ముడయ్యాయి. ఇక కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ సేల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.50 కోట్లు దాటింది. గ్లోబల్ స్టార్‌గా మారాక ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఫిగర్‌ చాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read