Monday, December 23, 2024
HomeMovie Newsకల్కి రివ్యూ .. గర్వించదగ్గ సినిమా

కల్కి రివ్యూ .. గర్వించదగ్గ సినిమా

- Advertisement -

ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తున్న కల్కి మూవీ ..ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా నడుస్తుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మరి సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? ప్రభాస్ , బిగ్ బి , కమల్ , విజయ్ దేవరకొండ , సల్మాన్ దుల్కర్ , దీపికా , దిశా పటాని ఇలా భారీ కాస్ట్ & క్రూ తో దాదాపు రూ.700 కోట్ల తో నిర్మితమైన ఈ సినిమాలో వారి యాక్టింగ్ ఎలా ఉంది..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

స్టోరీ :

కురుక్షేత్ర యుద్ధభూమితో సినిమా కథ స్టార్ట్ అవుతుంది. తమ సకల సైన్యాన్ని కోల్పోయి.. నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని దుఃఖంలో అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఉంటాడు. తనవాళ్లు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ (ఫేస్ చూపించలేదు) రావడం తో.. “రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా” అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని “నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్ కదా.. కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను.. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు” అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు.

దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడతాడు. “సరే.. కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలికి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కల్కి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది.” అంటూ కృష్ణుడు చెబుతాడు.

ఆ తర్వాత 600 సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతంలో అశ్వత్తామ (అమితాబ్ బచ్చన్) భైరవ (ప్రభాస్), సుమతి (దీపిక పదుకోన్), సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) మధ్య భవిష్యత్ కోసం పోరాటం జరుగుతుంది. జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ (ప్రభాస్) ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ K లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ K కోసం సుమతితోపాటు అమ్మాయిలను ఎందుకు బలి ఇస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తుంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్తామను కలుసుకొన్నది? ఇంతకు అశ్వత్తామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్తామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకొన్న సుమతి కోసం యాస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కల్కి 2898 ఏడీ సినిమా కథ.

సినిమా హైలైట్స్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ..ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని.. పురాణాల్లో రాసున్నదానిపై పరిశోధన చేసి.. చాలా కష్టపడి మూడు సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంభల ఇలా మూడు మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్‌కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు.. వీటి గురించే చూపించారు. అక్కడక్కడా కాస్త సరదా సంభాషణలతో ఫస్టాఫ్ అలా సా..గిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ.. మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్‌కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్‌ను సెకండాఫ్‌లో భారీ యాక్షన్ చూసేందుకు నాగ్ అశ్విన్ ముందే రెడీ చేశారు.

ఇక సెకండాఫ్‌లో భైరవ-అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్‌కి మంచి హై ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడ్రన్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవల్లో ఉంది. ఇక క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని మరోస్థాయి ట్విస్ట్‌ను అయితే నాగ్ అశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్స్‌‌యే.

కల్కి మూవీకి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపమే చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు దక్కిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపిక పదుకోన్ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హసన్‌కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు అతడి పాత్ర ప్రజెన్స్ తెర మీద కనిపిస్తుంది. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది.

కల్కి చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని మూవీ టీమ్ ముందు నుంచి చెబుతుంది. సినిమా చూసిన ఆడియన్స్‌కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్స్, ఆర్ట్ విభాగం అద్భుతంగా పని చేశాయి. ముఖ్యంగా నాలుగేళ్ల పాటు నాగ్ అశ్విన్ టీమ్ పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది.

#Kalki2898AD – Hollywood Range Movie from Indian Makers

Over All Movie is very gripping and interesting . The climax is one of the. Best ever expected. 3.5/5@nagashwin7 #Prabhas‘— UniversalTalkies (@utalkies) June 27, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read