Monday, December 23, 2024
HomeMovie Newsతొలి ఇండియన్ సినిమాగా ఓవర్సీస్ లో కల్కి రికార్డ్

తొలి ఇండియన్ సినిమాగా ఓవర్సీస్ లో కల్కి రికార్డ్

- Advertisement -

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘కల్కి 2898 AD’ సినిమా ఓవర్సీస్​లోనూ సరికొత్త రికార్డు సాధించింది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన ఈ కల్కి ..బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు చేసిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. అటు ఓవర్సీస్​లోనూ కల్కి జోరు ప్రదర్శిస్తోంది. నార్త్​ అమెరికాలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్​లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.

ఫస్ట్ వీకెండ్​ నార్త్ అమెరికాలో కల్కి కాసుల వర్షం కురిపిస్తోంది. 11+ మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో నార్త్​ అమెరికాలో తొలి వీకెండ్​ అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక సినిమాకు ఆల్​ ఓవర్ పాజిటివ్ టాక్ ఉండడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాగా, నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్​లో టాప్ 2 సినిమాలు (కల్కి, బాహుబలి 2) ప్రభాస్​వే కావడం విశేషం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read