అందరు ఊహించినట్లే కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద గత రికార్డ్స్ బ్రేక్ చేసింది. గత కొద్దీ నెలలుగా ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కల్కి మూవీ ..నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా నడిచింది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శన కూడా జరిగింది. దీంతో అన్ని చోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించింది.
‘కల్కి 2898 ఏడీ’ మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలుపుకుని రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడం తో ఫలితంగా మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 50 కోట్లు రాబట్టింది. ఇలా మొదటి రోజు దాదాపు రూ. 100 కోట్లు షేర్‌తో పాటు రూ. 200 కోట్లు గ్రాస్‌ను ఇది వసూలు చేసింది.