Movie News

SRK ను పక్కకు నెట్టిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రికార్డ్స్ మీద రికార్డ్స్ కొల్లగొడుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తిరగరాసిన ఈ మూవీ…తాజాగా షారుఖ్ ఖాన్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసింది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా జూన్ 27న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా చూసిన ప్రియులు ఇది టాలీవుడ్ సినిమానా అనేంతలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక విజువల్ వండర్ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపేస్తుంది. రిలీజ్ అయి దాదాపు మూడు వారాలు అవుతున్నా క్లౌడ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ థియేటర్లలో సెన్సేషనల్ కలెక్షన్లతో అదరగొడుతూ.. రికార్డుల వర్షం కురిపిస్తోంది.

కేవలం 2 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టి అబ్బురపరచింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుని నిర్మాతలకు లాభాల పంట పండించింది. కాగా ప్రస్తుతం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కల్కికి కలిసొచ్చిందనే చెప్పాలి. తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓ వైపు కలెక్షన్లలో దుమ్ము దులిపేస్తూ మరో వైపు టికెట్ల సేల్స్‌లో అదరగొడుతోంది. తాజాగా ప్రముఖ టికెట్ల బుకింగ్ యాప్ బుక్‌ మై షోలో కల్కి జూన్ 27 నుంచి జూలై 17 వరకు మొత్తంగా 12.15 మిలియన్ల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విషయాన్ని బుక్ మై షో తాజాగా తెలిపుతూ.. ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు, బుక్ మై షోలో కూడా సెన్సేషనల్ రికార్డు అని రాసుకొచ్చింది. అయితే బుక్ మై షోలో టికెట్ల బుకింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ సేల్ అయిన సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ (12.01 మిలియన్) ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును ప్రభాస్ కల్కి కేవలం 20 రోజుల్లోనే (12.15 మిలియన్) బద్దలు కొట్టి మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.