ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ కట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకులు కల్కి యుఫోరియాతో ఊగిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయకపోగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ కాసేపటికిందే రిలీజ్ అయి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
“భైరవ అంతెం” పేరుతో విడుదలైన ఫస్ట్ సాంగ్ కాసేపటి కిందే యూట్యూబ్ లో రిలీజ్ కాగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే పాత్ర పేరుతో సాంగ్ ని రిలీజ్ చేయగా, ఈ సాంగ్ ని ప్రముఖ పంజాబీ & బాలీవుడ్ సింగర్ “దిల్జిత్ దోషాన్జ్” పాడడం జరిగింది. తెలుగు మరియు హిందీలో ఈ సింగర్ పాట పాడగా, పాట మొత్తం పంజాబీ ఫ్లేవర్ తో అదిరిపోయిందని చెప్పాలి. ఇక సింగర్ దిల్జిత్ తో పాటు ప్రభాస్ పంజాబీ కండువా వేసుకుని సూపర్ అప్పీరెన్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసాడని చెప్పాలి. ఇక ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు. అలాగే తెలుగు వెర్షన్ లో మరో సింగర్ దీపక్ కూడా పాడడం జరిగింది. ఇక పాట మొదలవుతూనే పంజాబీ ట్యూన్ లో మొదలయి ఊపు తెప్పించగా, “ఒక నేనే, ఒకటైనా ఒంటరోన్ని కానే” అంటూ సాగిన సాంగ్ ప్రభాస్ హీరోయిజాన్ని ఉద్దేశించి ఉందని తెలుస్తుంది.
ఇక కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, పశుపతి, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా, కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.