ప్రభాస్- నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన ఈ కల్కి ..బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు చేసిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు ఓవర్సీస్లోనూ కల్కి జోరు ప్రదర్శిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు క్రాస్ చేసింది. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 65 కోట్ల రూపాయలుకు అమ్ముడుపోగా, ఆంధ్రాలోని అన్ని ఏరియా హక్కులు 103 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 168 కోట్లరూపాయల మేర బిజినెస్ జరిగింది.
ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా తొలి రోజు 45 కోట్ల రూపాయలు, రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 20 కోట్లు, నాలుగో రోజు 25.5 కోట్లు, 5వ రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఐదు రోజుల్లో 121 కోట్ల రూపాయలు నికరంగా, 189 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 4.4 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 85 లక్షలు, ఉత్తరాంధ్రలో 85 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 47 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, గుంటూరు 32 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరు జిల్లాలో 25 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 8 కోట్లు నికరంగా, 12 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 40 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.