Wednesday, December 25, 2024
HomeMovie Newsమూడో రోజు కూడా కల్కి ప్రభంజనమే

మూడో రోజు కూడా కల్కి ప్రభంజనమే

- Advertisement -

ప్రభాస్ నటించిన కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. గురువారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. మొదటి రోజు దాదాపు 191 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి. గురువారం రిలీజైన ఈ సినిమాకు వరుసగా మూడో రోజూ క్రేజ్ తగ్గలేదు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్​ఫామ్ బుక్ మై షో లో 24గంటల్లోనే 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకు మూడోరోజున ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదు. రోజురోజుకూ పెరుగుతున్న రెస్పాన్స్‌ చూసి ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదివారం వీకెండ్ కావడం వల్ల రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read