Friday, October 18, 2024
HomeMovie Newsకల్కి మరో ట్రైలర్ ..మరో అద్భుతం

కల్కి మరో ట్రైలర్ ..మరో అద్భుతం

- Advertisement -

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు. ఇక శుక్రవారం మరో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఫై మరింత ఆసక్తి నింపారు.

ఈ చిత్రంలో కాశీ లాంటి భారతీయ నగరాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కథంతా కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. దీనికి తగ్గట్టుగానే కథను మూడు ప్రపంచాలకు లింక్ చేస్తూ రిలీజ్ ట్రెయిలర్ ను కట్ చేశారు.

కారణ జన్ముడిని కడుపులో మోస్తున్న ఒక తల్లి(దీపికా పదుకునే).. దుష్టుల నుంచి ఆమెను రక్షించే అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్).. సర్వ భోగాలు లభించే ఆకాశంలోని కాంప్లెక్స్ సిటీకి వెళ్లాలని కోరుకునే భైరవ (ప్రభాస్).. ఈ క్రమంలో అశ్వద్ధామతో తలపడే భైరవ.. చివరకు కాశీ ప్రజలకు రక్షకుడిగా మారిన భైరవ.. ఇలాంటి సన్నివేశాలను మనం కల్కి కొత్త ట్రైలర్ లో చూడొచ్చు. విజువల్ గ్రాఫిక్స్ కట్టిపడేసేలా ఉంటే, ప్రభాస్ – అమితాబ్ మధ్య వచ్చే ఫైట్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. బుజ్జితో డార్లింగ్ చేసే విన్యాసాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సాంగ్ ద్వారా బ్యాగ్రౌండ్ స్కోర్ ను నడిపించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవరాల్ గా రెండో ట్రైలర్ సినిమా ఫై మరింత ఆసక్తి కలిగించారు మేకర్స్.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read