News

కల్కి కి భారీ షాక్..ఎందుకు ఇలా జరిగి ఉంటుంది..?

అందరు ఊహించినట్లే కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేసింది. గత కొద్దీ నెలలుగా ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కల్కి మూవీ ..గురువారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా నడిచింది. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. దీంతో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. కానీ సెకండ్ డే మాత్రం భారీ షాక్ తగిలింది. మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 191 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి. సినిమాకు హిట్ టాక్ రావడం తో సెకండ్ డే కలెక్షన్స్ మరింత పెరుగుతాయని భావించారు. కానీ సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది.

రెండో రోజు కేవలం 107 కోట్లు మాత్రమే ఈ సినిమాకి వచ్చాయి. మామూలుగా చాలా చిన్న సినిమాలకు మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి థియేటర్ నిండుతాయి. కానీ కల్కి సినిమాకి సంబంధించి దాదాపు 80 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ తగ్గాయి. అయితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చి కూడా కలెక్షన్ తగ్గాయి. అంటే ఈ సినిమా అంతగా ఎక్కలేదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమాని ఒక హైప్ తో లేపుతున్నారు. ఏదేమైనా మెల్లగా మౌత్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ దీపికా పదుకొనే కమలహాసన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. వీళ్లే కాకుండా చాలామంది దర్శకులు కూడా ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించారు.