Friday, October 18, 2024
HomeMovie Newsకల్కి ట్రైలర్ ముహూర్తం ఫిక్స్..?

కల్కి ట్రైలర్ ముహూర్తం ఫిక్స్..?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దిశా పటాని, దీపికా పదుకొనె జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా.. అశ్వత్థామగా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ నటిస్తున్నారు. కెరీయర్‌లోనే తొలిసారిగా కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఫస్ట్ లుక్ వంటివి సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా..అనే ఆత్రుత పెంచేయగా..ఇక ఇపుడు అసలు , సిసలైన ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. జూన్​ నెల తొలి వారంలో గ్రాండ్​గా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై మూవీటీమ్ నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇటీవల విడుదల చేసిన ‘బుజ్జి (కారు)’ ప్రోమోకు విశేష స్పందన రావడం వల్ల మూవీటీమ్ ట్రైలర్​పై మరింత దృష్టి సారించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్​ నాగ్ అశ్విన్ ట్రైలర్​ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక జూన్ 27న సినిమా వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read