Movie News

‘ కల్కి ‘ ఖాతాలో వచ్చి పడుతున్న రికార్డ్స్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా ఖాతాలో రికార్డ్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి. విడుదలైన మొదటి రోజు నుండి రికార్డులు కొల్లగొడుతూ మంచి థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది. ప్రభాస్ సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పాన్ ఇండియా భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం వల్ల అన్ని భాషల్లో కూడా కల్కి కి భారీ ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఇక కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు తెలుగు సినిమా చూస్తున్నామా..? హాలీవుడ్ సినిమా చూస్తున్నామా..? అనే రీతిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం తో ప్రతి ఒక్కరు సినిమా చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద కల్కి మూవీ హవా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే..

నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 17 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. మరోవైపు సౌత్ హీరోలలో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రెండుసార్లు సాధించిన తొలి హీరోగా ప్రభాస్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. గతంలో బాహుబలి2 (Baahubali 2) సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. బాహుబలి2 మూవీ 10 రోజుల్లో 1000 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయగా కల్కి 2898 ఏడీ సినిమా మాత్రం 1000 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయడానికి 15 రోజుల సమయం పట్టింది. కల్కి ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.