Monday, December 23, 2024
HomeMovie Newsవిడుదలకు ముందే RRR రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి

విడుదలకు ముందే RRR రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి

- Advertisement -

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో చేస్తూ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరగడమే కాదు గత బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేస్తుంది.

రాజ‌మౌళి ‘RRR’ సినిమా రిలీజ్​కు ముందే క‌లెక్ష‌న్లలో దూకుడు చూపించింది. ప్రీ సేల్స్ భారీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలోనే ఇప్పుడు ‘RRR’ని క్రాస్ చేసింది ‘క‌ల్కి’. నార్త్ అమెరికాలో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల మార్క్​ను దాటేసిందట. సినిమా రిలీజ్​కు ఇంకా రెండు వారాలు ఉండగానే ఈ స్థాయిలో సేల్ జరగడం రికార్డు అని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని సాధించింది కల్కి. ఇదే జోరు కొనసాగిస్తే ఈ చిత్రం విడుదలకు ముందే సులువుగా $2 మిలియన్లకు పైగా వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కల్కి ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందనేది ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రంలో అగ్ర నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. దీపికా పదుకొణె, దిశా పటానీ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన వంటి స్టార్లతో క్యాస్టింగ్ నిండిపోయింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్టర్ . జూన్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read