Movie News

కల్కి – బుజ్జి ట్రైలర్ రిలీజ్

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో చేస్తూ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్​ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా ఆయనకు తోడుగా బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ కారు కూడా సినిమాలో కనిపిస్తుంది. బుజ్జి – భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమాకే హైలెట్​గా నిలవనుందని, సినీ లవర్స్​ను కట్టిపడేయనుందని మూవీటీమ్​ చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యానిమేషన్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యానిమేషన్‌లోనూ యాక్షన్ డోస్ అదిరిపోయింది. భైరవ, బుజ్జిల బాండింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్ధమవుతోంది.

కల్కీ 2898 ఏడీ అనే సినిమాని ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉండే అశ్వత్థామను కూడా చూశాం. అయితే ఈ ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా బుజ్జి అలాగే భైరవ మధ్య ఉండే బాండింగ్ గురించే ఎక్కువగా చూపించే ఆస్కారం కనిపిస్తోంది. భైరవకు అసలు తాను ఎవరు? తన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియని ఒక్ సాదా సీదా కుర్రాడు అనే విషయం అర్థమవుతోంది. అతనికి ఒక మోడ్రన్ రిక్షా ఉంది. దానితో కాలం గడిపేస్తూ ఉంటాడు. అయితే అతనికి వాహనం ధ్వంసం అయిపోతుంది. దానితో అతని పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. దాంతో స్క్రాప్ నుంచి బుజ్జిని తయారు చేస్తాడు. ఈ ట్రైలర్ కేవలం వీళ్లిద్దరి బాండింగ్ గురించి మాత్రమే కాబట్టి కథను కూడా వారి వరకే పరిమితం చేశారు. బుజ్జి- భైరవ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. అలాగే భైరవకి ఏ కష్టం వచ్చినా బుజ్జి కాపాడుతుందని క్లారిటీ వచ్చింది. కాబట్టి మూవీలో వీళ్ల బాండింగ్ హైలెట్ కాబోతోంది.