Friday, October 18, 2024
HomeMovie Newsప్రభాస్..ఒక్క అడుగు

ప్రభాస్..ఒక్క అడుగు

- Advertisement -

పాన్ ఇండియా స్టార్..ప్రభాస్ అరుదైన రికార్డు కు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రికార్డు రాయాలన్న..ప్రభాసే..తన రికార్డు తానే బ్రేక్ చేయాలన్న ప్రభాసే అని ఇప్పుడు అభిమానులంతా అంటున్నారు. బాహుబలి తో ఎన్నో రికార్డ్స్ సృష్టించిన ప్రభాస్..ఇప్పుడు కల్కి తో ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ – ప్రభాస్ కలయికలో వచ్చిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఆ భాష..ఈ భాష కాదు అన్ని భాషల్లో కల్కి హావ కనపడుతుంది. నిజంగా తెలుగు డైరెక్టరేనా ఈ సినిమా చేసింది అని హాలీవుడ్ సైతం ఆశ్చర్యం కనపరుస్తుంది. ఆ రేంజ్ లో కల్కి హావ చూపిస్తుంది.

ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ విడుదలై 11 రోజులు అయినా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్​గా ఈ చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకుపైగా గ్రాస్​ వసూలు చేసినట్లు మూవీటీమ్​ అఫీషియల్​గా ప్రకటించింది. బాలీవుడ్‌లోనూ బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ తర్వాత రూ.200 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన మూవీ ఇదే. ఇక ప్రభాస్ సినిమాల పరంగా కల్కి రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. నార్త్‌ అమెరికాలో ఇప్పటివరకూ ఏ సౌత్​ మూవీ సాధించని విధంగా 16 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని అంచనా. ఇంకా బుక్‌ మై షోలోనూ కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ సెన్సేషనల్ సృష్టించింది. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అతి తక్కువ సమయంలోనే రూ.3కోట్లు వసూలు చేసిన చిత్రంగానూ కల్కి రికార్డుకెక్కింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read