Friday, October 18, 2024
HomeMovie News1000 కోట్ల క్లబ్ లోకి కల్కి..?

1000 కోట్ల క్లబ్ లోకి కల్కి..?

- Advertisement -

ప్రభాస్- నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన ఈ కల్కి ..బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు చేసిన ఈ సినిమా..మరో వారంలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరబోతున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ వైడ్ గా రూ. 790 వరకు వసూల్ చేసిందని , అంటే ఎలా లేదనుకున్నా రోజుకు రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. మరో వారంలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అభిమానులు అంటున్నారు. మరి ఆ క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి. 8వ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది.

‘కల్కి 2898 ఏడీ’ మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది. ఇక ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read