రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుండి రికార్డులు కొల్లగొడుతూ మంచి థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది. ప్రభాస్ సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పాన్ ఇండియా భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం వల్ల అన్ని భాషల్లో కూడా కల్కి కి భారీ ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఇక కల్కి సినిమా విడుదలైన మొదటి రోజు నుండే వంద కోట్ల ఓపెనింగ్స్ స్టార్ట్ చేసి వీకెండ్ ముగిసే దాకా రోజు వంద కోట్లు రాబట్టడం విశేషం. ఇక వర్కింగ్ డేస్ లో కూడా కల్కి జోరు చూపించి కేవలం తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడం జరిగింది. ఇక పదో రోజు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. 10 రోజు ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 6 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 20 కోట్లు వసూలు చేసింది. ఇలా 10 రోజుల్లోనే రూ. 390 కోట్లు షేర్‌తో పాటు రూ. 850 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ఇక ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా కల్కి సినిమా రన్ టైం ని తగ్గించారు మేకర్స్. కానీ మీరనుకున్నట్టు ఇండియాలో కాదు. అది ఓవర్సీస్ లో. అవును.. కల్కి సినిమా కాస్త ల్యాగ్ ఎక్కువైంది అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో ప్రేక్షకుల సౌలభ్యం కోసం అక్కడ మూడు గంటల నిడివి ఉన్న కల్కి రన్ టైం ని 2 గంటల 45 నిమిషాలకు తగ్గించారు.