లేడి సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని ఆధారంగా రూపొందించిన “నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితం, మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో మొదలైన ప్రేమకథ నుండి వివాహం వరకు ఉన్న విశేషాలు చూపించారు.
ఈ డాక్యుమెంటరీ చుట్టూ కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, “నానుమ్ రౌడీ ధాన్” చిత్రంలో నయనతార మరియు ధనుష్‌కు సంబంధించిన సన్నివేశాలను డాక్యుమెంటరీలో వాడుకోవడంపై ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపాడు. మూడు సెకన్ల వీడియో క్లిప్ కోసం రూ.10 కోట్లను డిమాండ్ చేశారంటూ నయనతార సోషల్ మీడియా వేదికగా ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదాల మధ్య, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నయనతారకు మద్దతు ప్రకటించింది. “బలమైన మహిళను మరింత శక్తివంతంగా చూడటం కంటే స్పూర్తినిచ్చేది మరొకటి లేదు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. జాన్వీ కపూర్ పోస్ట్ వైరల్ అవడంతో, నయనతార డాక్యుమెంటరీపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుత ప్రాజెక్టులు విషయానికి వస్తే…ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమాలో జాన్వీ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక బాలీవుడ్లో “సన్నీ సంస్కారి కి తులసి కుమారి” సినిమాలోనూ నటిస్తోంది.