కిర్రాక్ ఆర్పీ..గత కొద్దీ రోజులుగా మీడియా లో వైరల్ గా మారాడు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి వరుస ఇంటర్వూస్ తో నానా హడావిడి చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫై కీలక వ్యాఖ్యలు చేసి బన్నీ అభిమానుల్లో ఆగ్రహం నింపాడు. ఇందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మా హీరో ఫై నెగ్గిటివ్ గా మాట్లాడతావా అని చెప్పి అభిమానులు కిర్రాక్ ఆర్పీ కి సంబదించిన కర్రీ పాయింట్ లపై దాడులు చేసి ఆస్థి నష్టం చేసారు. తాజాగా ఆర్పీపై జబర్దస్త్ ఆర్టిస్టు షేకింగ్ శేషు తాజాగా ఫైర్ అయ్యారు. ఆర్పీ బండారం ఇది అంటూ ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
“అప్పట్లో ఓ ప్రొడ్యూసర్‌ని పట్టుకొని సినిమా తీద్దామని ఒప్పించి.. జేడీ చక్రవర్తి గారితో కూడా ఓపెన్ చేయించి.. ఆరోజు నాగబాబు గారు కూడా వచ్చారు.. మంచి హడావిడి చేశాడు ఆర్పీ. అమ్మో ఏదో పెద్ద సినిమా అవుతుందని మేమూ ఆనందించాం.. వీడు ఎక్కడికో వెళ్లిపోతాడని అనుకున్నాం. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడే. కానీ హైదరాబాద్‌లో ఓ ఆఫీస్ ఓపెన్ చేశాడు.. దాని రెంట్ నెలకి రూ.50 వేలు.. సినిమాయే స్టార్ట్ అవ్వలేదు. ప్రొడ్యూసర్ పాపం ఎక్కడో ఉంటాడు. ఇక మనోడు రోజూ ఖర్చులు అంటూ సినిమా మొదలుకాకముందే ఒక రూ.20 లక్షలు ఖర్చు పెట్టేశాడు. అప్పటికి సినిమా క్లాప్ కూడా కొట్టలేదు. దీంతో నిర్మాత లబోదిబోమని వచ్చాడు. ఏంటి ఆర్పీ సినిమాయే మొదలుకాలేదు.. అప్పుడే రూ.20 లక్షలు ఖర్చు పెట్టేశావ్.. ఇక సినిమా మొదలైతే నా పరిస్థితేంటి అని మొత్తుకొని నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసే నీ మీద నమ్మకం లేదని గగ్గోలు పెట్టాడు. అలాంటి వాడు ఆర్పీ. వీడు సరిగా ఉండి ఎదటి వాళ్లని నిందిస్తే అదొక పద్ధతి. వీడే గురువింద టైపు. వీడు ఒకళ్లని నిందిస్తాడా..” అంటూ షేకింగ్ శేషు ప్రశ్నించారు.