2020లో కరోనా మహమ్మారి సమయంలో OTT ప్లాట్‌ఫారమ్‌పై నేరుగా విడుదలైన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా అభిమానులను అంచనాల ప్రక్కన ఉంచినట్లుగా ఉంటే, ఇప్పుడు అదే చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఒక కొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది.
సిద్దు జొన్నలగడ్డ అభిప్రాయం: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. పాండమిక్ కారణంగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదు. ఇప్పటికీ ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేసినప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నాకు ఉండేది. ఈ సినిమా జర్నీలో నటుడిగా అనేక విషయాలు నేర్చుకున్నాను. రవితో కాంప్లికేషన్ లేకుండా కొలాబరేట్ చేయడం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయాలని అభిమానులు రవికాంత్‌ను సోషల్ మీడియాలో మెసేజ్ చేయడంతో, నాకూ ఈ సినిమా థియేటర్స్‌కు తీసుకెళ్లాలని అనిపించింది. రానాకు చెప్పినపుడు త్వరగా ప్లాన్ చేశామనిపించింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్‌లోకి రావడం, ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనేది నాకు ఆసక్తికరంగా ఉంది.ఫిబ్రవరి 14న థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే ఎక్సయిట్మెంట్ వుంది


రానా దగ్గుబాటి అభిప్రాయం: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ ప్రతి మనిషి జీవితంలో కలిగే కాంప్లికేషన్ల గురించిది. నా జీవితంలో డైరెక్టర్ రవికాంత్, తర్వాత సిద్దు (నవ్వుతూ). రవికాంత్ చెప్పిన కథ నాకు చాలా దగ్గరగా వుంది. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే అంశమే. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. నిజానికి, సిద్దు, రవికాంత్‌తో మరొక సినిమా చేయాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఈ సినిమాకు థియేటర్స్‌లో విడుదల చేయడం మాకు కొత్త అనుభూతిని అందిస్తుంది.’
డైరెక్టర్ రవికాంత్ పెరెపు అభిప్రాయం: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ థియేటర్స్‌లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సిద్దు ఈ సినిమాకు బిగ్గెస్ట్ సపోర్ట్. ఈ సినిమా జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. రానా గారే ఇలాంటి సినిమాలను నిర్మించగలరు.’
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అభిప్రాయం: ‘ఈ సినిమా మా కోసం బిగ్ మూమెంట్. థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కావడం ఎంతో ఎక్సయిటింగ్ గా వుంది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. అందరూ థియేటర్స్‌లో చూసి ఆనందించగలుగుతారని ఆశిస్తున్నాను.’
హీరోయిన్ సీరత్ కపూర్ అభిప్రాయం: ‘ఈ సినిమా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ యూనిక్ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. కరోనా సమయంలో థియేటర్స్‌లో విడుదల చేయలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్‌లో రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది ఒక మ్యాజికల్ మూవీ. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి.’