నేచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. సినిమా బడ్జెట్ ఎంతైనా తన రెమ్యునరేషన్ విషయంలో నాని రాజీ పడటం లేదంటున్నారు. దీంతో సినిమా సక్సెస్ కాకపోయినా, నానికి భారీగా పారితోషికం చెల్లించాల్సిరావడంతో నిర్మాతలకు నష్టాలే వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే నానితో కొత్త సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు మాట్లాడుకుంటున్నారు.
నాని తాజాగా నటిస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వచ్చేనెల ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్ లేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సినిమాకు రిలీజ్ కష్టాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం సినిమాకు ఓవర్ బడ్జెట్ అవ్వటంతో బిజినెస్ జరగటం లేదని అంటున్నారు. ఒక సినిమాకు సుమారు 40 కోట్లు రెమ్యునరేషన్‌గా హీరో తీసుకోవడమే నిర్మాతలకు భారమవుతుందంటున్నారు. హీరో పారితోషికంతోనే బడ్జెట్ డబుల్ అవుతుందని విశ్లేషిస్తున్నాయి సినీ వర్గాలు. నాని గత సినిమా హాయ్ నాన్న కూడ ఎక్కువ బడ్జెట్ పెట్టారు. కానీ కలెక్షన్స్ ఆశినంతగా లేక నిర్మాత నష్టపోయారంటున్నారు. సినిమా కలెక్షన్లు లేకపోయినా తన తన రెమ్యూనరేషన్ మాత్రం నాని తగ్గించట్లేదని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా బిజినెస్‌పైనా దీని ఎఫెక్ట్ బాగా పడిందని టాలీవుడ్ టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది నానినే చెప్పాలి.