కమల్‌హాసన్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 మూవీ శుక్రవారం
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథ, స్క్రీన్ ప్లే , మ్యూజిక్ ఇలా ఏది కూడా ప్రేక్షకులను మెప్పించలేక ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ టాక్ సినిమా కలెక్షన్ల ఫై భారీగా పడింది. దీంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.
వరల్డ్ వైడ్ గా రూ.175 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది భారతీయుడు.మొదటి రోజు కేవలం రూ.30 కోట్ల షేర్ మాత్రమే నమోదయ్యింది. అంటే ఇంకా రూ.145 కోట్ల షేర్ ని రాబడితేనే ‘భారతీయుడు 2’ గట్టెక్కినట్టు. తెలుగులో కొంత బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి. రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజు రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 2 వ రోజు కూడా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. శని , ఆదివారాల్లోకి 60 శాతం రికవరీ అయ్యాయి అంటున్నారు. ఇక మిగతా చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అంటున్నారు. అలాగే విజయ్ తో ‘నన్బన్'(తెలుగులో స్నేహితుడు) సినిమా చేసినప్పటి నుండి దర్శకుడు శంకర్ కి శని పట్టుకుందని.. అప్పటి నుండి శంకర్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు అంటూ విజయ్ ని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజెన్లు.