Monday, December 23, 2024
HomeMovie Newsఇండియన్‌ 2 రన్ టైం ఎంతంటే..!!

ఇండియన్‌ 2 రన్ టైం ఎంతంటే..!!

- Advertisement -

యావత్ సినీ అభిమానులువెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీ ఇండియన్‌ 2. లోకనాయకుడు కమలహాసన్‌ నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇండియన్‌ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలుసు. భారతీయుడు 2 సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. అలాగే ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రమోషనల్‌ ఈవెంట్‌ ఊడా ఘన విజయం సాధించింది.

ఇదిలా ఉంటే ఇండియన్ 2 (భారతీయుడు 2) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు లాంగ్‌ రన్‌ టైమ్‌ పిక్స్‌ చేశాడు దర్శకుడు శంకర్‌. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఇండియన్‌ 2 సినిమా నిడివి 180 నిమిషాలు. అంటే మూడు గంటలు. నిజానికి సినిమా ఎప్పడో రావాల్సింది. అనేక కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇంత ఆలస్యంగా వస్తున్న ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువైనా ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టదని మేకర్స్‌ చెబుతున్నారు. ఇండియన్‌ 2లో ఎస్‌జే సూర్య , బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం తదితరులు ఉన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read