యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న భారతీయుడు 2 మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంచలన దర్శకుడు శంకర్ – కమల్ హాసన్ కలయికలో 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ల కింద సుబాస్కరన్ అలీరజా, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ , ప్రోమోస్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి.
ఈ క్రమంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికెట్ మంజూరు చేసారు. ఇక రన్ టైమ్ 180.04 నిమిషాలు గా తేల్చారు. సినిమా చాల బాగుందని , కమల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడని..శంకర్ చక్కటి కథతో తెరకెక్కించారని, ప్రేక్షకులకు ఖచ్చితంగా సినిమా నచ్చుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటె..ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే- వారం రోజుల పాటు అదనపు షోలను కూడా ప్రదర్శించడానికి అంగీకారాన్ని తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. మల్టీప్లెక్స్‌లల్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో 50 రూపాయలను పెంచుకోవచ్చు.