తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపింది. కానీ అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో.. సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కడుపుతో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చి కూడా నెట్టింట వైరల్ అయింది. ఇక తల్లిగా ఫుల్ బీజీగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ వెండితెర ఫై కనిపించడం కష్టమే అని తెలుస్తుంది.
తాజాగా ఇలియానా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. రాత్రిళ్లు నిద్ర ఉంటోందా? మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు? ఇండియాను మిస్ అవుతున్నారా? బీచ్‌ల్లోనే ఎప్పుడూ ఎక్కువగా కనిపిస్తారెందుకు? అంటూ ఇలా పలు రకాలుగా ప్రశ్నలు సంధించారు. నిద్ర అనేది తనకు కరువైందన్నట్టుగా చెప్పుకొచ్చింది. మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నట్టుగా తెలిపింది ఇలియానా. ప్రస్తుతం సినిమాలు అనే ఆలోచన లేదని, పూర్తిగా తన బిడ్డ కోసమే టైం కేటాయించాలని అనుకుంటున్నట్టుగా తెలిపింది. సరైన టైం వచ్చినప్పుడు మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా వైవాహిక బంధం అందంగా సాగుతోంది. నా భర్తను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పడం చాలా కష్టం. నా కష్ట సమయాల్లో.. నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడు ఉన్నాడు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి క్షణం నాకోసం నిలబడ్డాడు. అతడు ప్రేమ అంతులేనిది. ప్రతిరోజూ అతడు నాతోనే ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చింది.