Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలుఇప్ప‌టివ‌ర‌కూ నేను పోషించిన పాత్రల్లో ఇది చాలా బలమైన క్యారెక్టర్

ఇప్ప‌టివ‌ర‌కూ నేను పోషించిన పాత్రల్లో ఇది చాలా బలమైన క్యారెక్టర్

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాత‌లు. ఈ ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా వైల్డ్‌డాగ్ బేస్ క్యాంప్ పేరుతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో తాజాగా జాతీయ అవార్డులు సాధించిన మహర్షి, జెర్సీ చిత్ర యూనిట్‌ను సత్కరించారు.

- Advertisement -

నాకెంతో ప్రత్యేకమైన చిత్రం.
హీరోయిన్ సయామీ ఖేర్ మాట్లాడుతూ.. ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఓ అమ్మాయికి ఇంత యాక్షన్ సీక్వెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇది మంచి థ్రిల్లింగ్ సినిమా. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 2న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఎంతో నేర్చుకున్నాం. .
ప్రకాష్ మాట్లాడుతూ.. ‘థ్యాంక్స్ చెప్పాల్సిన వారు చాలా మంది ఉన్నారు. నాగార్జున గారి ఎనర్జీ ఓ రేంజ్‌లోఉంటుంది. ఆయనతో కలిసి నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాం. మనకు తెలియని ఎంతో మంది హీరోలున్నారు. వారి గురించే ఈ సినిమా. ఏప్రిల్ 2న రాబోతోంది. అందరూ థియేటర్లలో చూడండి’ అని అన్నారు.

పైకి కిందకు..
మయాంక్ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యవంతుడైన మానవుడి ఈసీజీలో హెచ్చుతగ్గులుంటాయి. స్ట్రేట్ లైన్ ఉంటే మనిషి చనిపోయినట్టు. వైల్డ్ డాగ్ రాకముందు నా ఈసీజీ లెవెల్ కింది స్థాయిలో ఉంది.. నాగార్జున సర్‌తో మొదటి సారి షూటింగ్ చేసినప్పుడు ఈసీజీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. మధ్యలో కరోనా రావడంతో మళ్లీ తగ్గిపోయింది.. ఇక షూటింగ్ ఉంటుందా? లేదా? అని డిప్రెషన్ వల్ల కిందకు వచ్చింది. మళ్లీ షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు ఈసీజీ మళ్లీ మీదకు వెళ్లింది. ఇక ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మరింత పైకి వెళ్లింది. ఈ మూవీ ఏప్రిల్ 2న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఇలాంటివి అరుదుగా వస్తాయ్..
ప్రదీప్ మాట్లాడుతూ.. ‘నాగ్ సర్, చిరంజీవి సర్ లాంటి వాళ్ల సినిమాలు చూసి పెరిగాను.. ఇలా ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రాలు మామూలుగా హాలీవుడ్‌లో వస్తుంటాయి. తెలుగులో ఇలాంటివి అరుదుగా వస్తాయ్.. ఏప్రిల్ 2న సినిమా చూడండి.. కన్నుల విందుగా ఉంటుంది’ అని అన్నారు.

నా జీవితాన్ని మార్చే శుక్రవారం..
అలీ రెజా మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ తరువాత ఇది నా పెద్ద రిలీజ్.. ఈ సమయం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. మయాంక్ చెప్పినట్టు నాకు ఈసీజీ పెరుగుతూ వచ్చింది. మామూలుగా నటులకు శుక్రవారం అంటే ఎంతో ప్రత్యేకంగా. సినిమాలన్నీ శుక్రవారమే వస్తుంటాయి. ఎందరో జీవితాలను శుక్రవారం మార్చేస్తుంది. ఏప్రిల్ 2 నా జీవితాన్ని మార్చే శుక్రవారం.. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సొంత సోదరుడిలా అయిపోయారు..
యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ మాట్లాడుతూ..‘సాంకేతిక నిపుణులు ఎంత చేసినా చివరకు దాన్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చేంది నటీనటులే. నాగార్జున, ఆయన టీం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కొండపై జారిపడిపోయే సీన్ ఉంటుంది.. దాన్ని చేస్తారా? అని అనుమానం వచ్చింది. కానీ అడగక ముందే ఆయనే చేస్తానని వచ్చారు. 40ఏళ్లుగా స్టంట్ మాస్టర్‌గా పనిచేశాను. కానీ కరోనా వల్ల ఏడేళ్లు ఖాళీగా ఉన్నాను. ఈ సినిమాతో పని చేయడం ద్వారా నాగార్జున గారు సొంత బ్రదర్‌‌లా అయిపోయారు. ఏప్రిల్ 2న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఆయన ఇచ్చిన సలహా..
కొరియోగ్రాఫర్ రాజసుందరం మాట్లాడుతూ.. ‘నాగార్జున గారితో ఎన్నో పాటలు చేశాను. సెట్‌లో ఎక్కువగా అరుస్తుంటాను. కూల్‌గా ఉండమని ఆయన ఇచ్చిన సలహాను పాటించేందుకు ప్రయత్నిస్తున్నాన’ని అన్నారు.

తెలుగు సినిమా హద్దులు చెరిపేందుకు..
ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘అందరికీ థ్యాంక్స్. మెమంటో నేను తీసుకున్నాను కానీ అది మహర్షి టీం అందరిది. సోలోమన్ ఆ చిత్రాకికి కో రైటర్.. వైల్డ్ డాగ్ అదిరిపోవాలి. నాగార్జున ఇలా సత్కరించడంతో ఈ ఈవెంట్ ఇంకాస్త ప్రత్యేకంగా మారింది. ఊపిరి సినిమాతో నా జీవితం మారిపోయింది. ఆ అవకాశం ఇచ్చినందుకు నాగ్ సర్‌కు థ్యాంక్స్. 120 కేజీలు.. అందుకే ఇలా మారాను. ఎప్పుడూ కూడా హద్దులు చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా అలాంటి చిత్రమే. నిరంజన్ గారే సోలోమన్‌ను ఊపిరి కథలోకి తీసుకుచ్చారు. ఆయన రావడంతోనే నా ఆలోచన మారిపోయింది. ఆయనేంటో నాకు తెలుసు.. ఏప్రిల్ 2న తరువాత ప్రపంచానికి తెలుస్తుంది’ అని అన్నారు.

సినిమా పెద్ద హిట్ అవ్వాలి..
ఎడిటర్ నవీన్ నూలి మాట్లాడుతూ.. ‘జెర్సీ సినిమా చేసినప్పుడే ఎంతో ఎగ్జైట్ అయ్యాను. మళ్లీ 36 ఏళ్ల తరువాత ఎడిటింగ్ విభాగంలో అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. వైల్డ్ డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

పెద్ద హిట్ అవ్వాలి..
ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. ‘జెర్సీ సినిమా చేస్తున్నప్పుడు అవార్డు మాకు వస్తుందని అనుకోలేదు. ఆ సమయంలో ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి.. మాకు అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ఇలా పిలిచి సత్కరించినందుకు థ్యాంక్స్. ఇలా నాగార్జున గారితో కలిసి స్టేజ్ మీద నిల్చోవడం ఆనందంగా ఉంది. వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న రాబోతోంది. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సినిమా హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది..
చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… ‘సినిమా ముందు నన్ను ఎగ్జైట్ చేస్తే.. ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని చూస్తాను.. సోలోమన్ గారు ఐడియా చెప్పినప్పుడు బాగానే ఉందని అన్నాను. అయితే ఇది కొత్త ప్రయోగం.. దీన్ని నాగార్జున గారు ఒక్కరే చేస్తారు.. ఆయన ఓకే అంటే చేద్దామని అన్నాను. అలా ఆయన ఓకే అన్నారు. సినిమాను ఆల్రెడీ ఓ ముప్పై మందికి చూపించారు. సినిమా హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. నాగార్జున గారు ఈ సినిమాతో 40వ దర్శకుడిగా సోలోమన్‌ని తెలుగు తెరకు పరిచయం చేశారు’ అని అన్నారు.

కథ అనుకున్నప్పుడే నాగార్జున గారు మదిలో మెదిలారు..
చిత్ర ద‌ర్శ‌కుడు అహిషోర్ సాల్మ‌న్ మాట్లాడుతూ – ‘ఓ చిన్న ఆర్టికల్ ద్వారాఈ కథ పుట్టింది. ఎన్ఐఏ వారు చేసిన పరిశోధనలెన్నో చేశారు. 2007 నుంచి 2013 వరకు ఎన్నో ప్రమాదాలు, బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. అలాంటి కేసును చేధించేందుకు ఎన్ఐఏ వాళ్లకు ఇచ్చారు. వారు దాని కోసం ఎంత కష్టపడ్డారు.. అలాంటి వారి కథను ప్రేక్షకులకు చెప్పాలని నాకు అనిపించింది. అండర్ కవర్ ఆపరేషన్ చేసే ఆఫీసర్‌కు ఓ స్ట్రేచర్ ఉండాలి.. అలా కథ అనుకున్నప్పుడే నాగార్జున గారు మదిలో మెదిలారు. ఆయనకు చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. నన్ను నమ్మినందుకు నాగార్జున, నిరంజన్ గారికి థ్యాంక్స్. యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్‌తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నాగార్జున కెరీర్‌లొ ఇదే బెస్ట్ లుక్
సంగీత ద‌ర్శ‌కుడు తమన్ మాట్లాడుతూ… ‘వైల్డ్ డాగ్ అనేది నాకు సర్ ప్రైజ్ లాంటిది. నెల నెలన్నరలోనే బ్యాక్ గ్రౌండ్ కంప్లీట్ చేయాలని అన్నారు. వైల్డ్ డాగ్ హద్దులను చెరిపేసింది. నాగార్జున గారి కెరీర్‌లొ ఇదే బెస్ట్ లుక్ అవుతుంది. నాగార్జున గారిని నా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌తో ఎలా చూపించాలి అని అనుకున్నాను. సోలోమన్ రాసిన డైలాగ్‌లు నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించేశాయి. ఏప్రిల్ 2న ఈ సినిమా అదరగొట్టబోతోంది. ఈ సినిమా, కథ ఎక్కువ సంగీతాన్ని కోరుకుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత నిరంజన్‌ గారికి థ్యాంక్స్’ అన్నారు.

ఆయన నిర్మాతగా ఉన్నందుకే సినిమా చేశాను..
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డులు సాధించినందుకు మహర్షి, గౌతమ్, రాజ సుందరం, నవీన్ ఇలా అందరికీ కంగ్రాట్స్. ఏసీపీ విజయ వర్మ పాత్ర నచ్చడంతోనే వైల్డ్ డాగ్‌కు ఓకే చెప్పాను. ఆయన మంచి టీం లీడర్, మంచి భర్త, మంచి తండ్రి. ఆయన ప్రేమించిన దానికి ఏం చేసేందుకైనా రెడీగా ఉంటారు. ఆయన భారతదేశాన్ని ప్రేమించారు. దాని కోసం ఏమైనా చేస్తారు. కొత్తదనం కోసం పాకుతూ ఉంటారు.. దేనీ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటారు.. నాకు కూడా అలానే ఉంటుంది. కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త బ్లెడ్, కొత్త ఎనర్జీ కోసం ప్రయత్నిస్తుంటాను. యంగ్ వాళ్లతో పని చేస్తుంటాను కాబట్టే.. ఇలా నేను యంగ్‌గా ఉంటాను.. మూసధోరణి పాత్రలు, సినిమాలు చేయడం నాకు నచ్చదు. నాకు బోర్ కొట్టిన పనులు, సినిమాలు మళ్లీ చేయను. నేను పోషించిన పాత్రల్లో ఇది చాలా బలమైన క్యారెక్టర్. ఈ పాత్ర కోసం రాసిన డైలాగ్‌లు నా గుండెల్లోనే ఉంటాయి. నేను వైల్డ్ డాగ్ కాదు. నిర్మాత నిరంజన్ రెడ్డి అసలు వైల్డ్ డాగ్. క్షణం, ఘాజీ లాంటి కొత్త కొత్త సినిమాలను తీస్తుంటారు. నిరంజన్ రెడ్డి గారు ఈ కథను తీసుకొచ్చారు కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను. సోలోమన్ మైండ్‌లో అన్నీ ఉంటాయి. ఆయనకు ఏం కావాలో అన్నీ తెలుసు.

కెమెరా మెన్ షణిల్ కూడా ఓ వైల్డ్ డాగ్. కోవిడ్ వల్ల లాక్డౌన్ పెట్టేసిన తరువాత మళ్లీ షూటింగ్ కోసం మనాలి వెళ్లాలి అని నిరంజన్ గారు అన్నాక ఒక్కొక్కరి మొహం చూడాలి. స్పెషల్ ఫ్లైట్‌లో అక్కడి వెళ్లాను. వెళ్లాక మాస్క్ తీసి బయట పడేస్తే వచ్చిన ఆనందం మామూలుగా లేదు. పని చేస్తేనే మనకు సంతోషమని అప్పుడు అనిపించింది. అదే మనకు ముఖ్యం. మనం చేసే పనిని ప్రేమిస్తే.. రిజల్ట్ ఎంత బాగా వస్తుందో అందరికీ తెలిసిందే. మీ పనిని మీరు ప్రేమించండి.. చక్కగా చేయండి. వైల్డ్ డాగ్‌లో మేం చేసింది అదే. ప్రతీ ఒక్కరూ వారి పనిని ప్రేమిస్తూ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ మురళీ, విఎఫ్ ఎక్స్ యుగంధర్, మిక్సింగ్ కన్నన్ ఇలా అందరూ ఎంతో కష్టపడ్డారు.

ఈ సినిమా అంతా అయిపోయింది. విత్ అవుట్ మ్యూజిక్ ఫస్ట్ కాపీ వచ్చింది. అయితే ఈ చిత్రానికి క్లాసిక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ కలిపితే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని అనిపించింది. అప్పుడే క్రాక్ సినిమా చూశాను. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సినిమా అంతపెద్ద హిట్ అయింది. వైల్డ్ డాగ్ సినిమా కోసం తమన్‌ను తీసుకోవాలని ఫ్యామిలీ పరంగా ఫ్లాష్ బ్యాక్‌ చెప్పి బ్లాక్ మెయిల్ చేశాను. మూడు వారాలే ఉంది సినిమా చేసి పెట్టమని అడిగాను. తమన్ తన సంగీతంతో సినిమాను ఎక్కడో నిలబెట్టేశారు. చాలా ప్రేమతో ఈ సినిమాను తీశాం.. ప్రయోగాత్మక చిత్రమని పక్కన పెట్టండి.. మంచి కమర్షియల్ సినిమా ఇది. బజ్ బాగుంది.. అన్ని మంచి సూచనలే కనిపిస్తున్నాయి.. ఊపిరి సినిమాతో కార్తీ నా తమ్ముడిలా మారిపోయాడు. కార్తి సుల్తాన్ సినిమా కూడా ఏప్రిల్ 2న రాబోతోంది. ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలి’ అని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read