జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కి ..నటి ప్రియమణి కి మధ్య ఏదో నడుస్తుందని..ఇద్దరి మధ్య ఓ రిలేషన్ కొనసాగుతుందని..ఇద్దరు కలిసి పలుసార్లు బయటకు వెళ్లారని..ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ఇలా అనేక రకాల వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రియమణి..ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాల్లోనూ నటిస్తూనే.. బుల్లితెర షోస్‌లో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఆ మధ్య జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మెంటర్‌గా చేస్తూ.. ప్రియమణితో మంచి బాండింగ్ ఏర్పరుచుకున్నాడు. ప్రియమణి, ఆదిని బావ అని పిలవడంతో వీరిద్దరి ఫన్నీ ఎపిసోడ్స్ ఆ షోకే హైలైట్ అవడమే కాదు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ రాబట్టింది. అయితే ఈ క్రమంలో వీరిద్దరు క్లోజ్‌గా ఉండటమే కాకుండా ఒకసారి ప్రియమణి ఆది ల్యాప్‌పై కూర్చోవడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని అప్పటి నుండి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. ”ప్రియమణి జాతీయ అవార్డ్ గ్రహిత అయినప్పటికీ సెట్లో అందరితో క్లోజ్‌గా స్పోర్టీవ్‌గా ఉంటుంది. నన్ను బావ అని పిలుస్తుంది. ఎప్పుడు ఏం చేసినా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసి పోతారు. డ్యాన్సర్లతో కలిసి రీల్స్ చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఆమె ఓ స్టేజ్‌ను చూసి వచ్చారు. స్టార్ ఇమేజ్ను అనుభవించి వచ్చారు. చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్. అప్పట్లో మా మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ మధ్య అలాంటివి ఏమీ లేవు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ క్లారిటీ తో ఈ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆది..జనసేన ప్రచారం లో బిజీ గా ఉన్నారు.