కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర చిత్రం నుంచి గత నెల వచ్చిన ఫియర్ సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ పాట మోతమోగుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెండో పాట కూడా తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈసారి మెలోడీ సాంగ్ వస్తుందని టాక్. దేవర షూటింగ్ ప్రస్తుతం గోవా పరిసరాల్లో సాగుతోంది. ఈ మూవీ షూటింగ్‍ను ఆగస్టులోగా పూర్తి చేయాలనే టార్గెట్‍ను పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
దేవర మూవీని గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ హైప్ ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‍లోకి జాన్వీ అడుగుపెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అజయ్, షైన్ టామ్ చాకో, నరైన్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక ఈ మూవీ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల మొత్తం పంపిణి హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్స్ సొంతం చేసుకుంటే, నైజం ఏరియాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలిసింది.
ఓవర్సీస్ లో భారీ స్క్రీన్ కౌంట్ ఉండేలా హంసిని ఎంటర్ టైన్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హిందీ వెర్షన్ కు సంబంధించిన హక్కులు అనిల్ తదాని, కరణ్ జోహార్ లు సంయుక్తంగా చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓటిటి రైట్స్ ఫాన్సీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, శాటిలైట్ ఛానల్ స్టార్ మా బుల్లితెర హక్కులను తీసుకుందట.
ఈ మొత్తం కలిపి సుమారు అయిదు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని ఒక అంచనా. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కోణంలో చూస్తే ఇది భారీ మొత్తం. టేబుల్ ప్రాఫిట్ పైనే దేవర రిలీజ్ కాబోతుంది.