Movie News

సమంత తో నటించొద్దంటూ హీరో వార్నింగ్

సమంత తో నటించొద్దంటూ బాలీవుడ్ హీరోకు వార్నింగ్ ఇచ్చినట్లు స్వయంగా సదరు హీరోనే తెలుపడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. వరుణ్ ధావన్ సమంతతో కలిసి నటించిన అనుభవాన్ని పంచుకుంటూ, సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తుల నుండి సూచనలు పొందినట్లు తెలిపారు. ఆయన మాటల్లో, “సమంతతో నటించ వద్దని చాలామంది నాకు సలహాలు ఇచ్చారు. కొందరు నా క్రేజ్ మాయమవుతుందని వార్నింగ్ ఇచ్చారు.” అని పేర్కొన్నారు. అయినా, ఆ సలహాలను పట్టించుకోకుండా, సమంతతో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. “సమంత వంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆమె చేసిన ఫైట్స్ నిజంగా హీరోలకు ధీటుగా ఉంటాయి, అవి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. అయినప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. సమంత నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం ”సిటాడెల్” అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ ధావన్ సమంతపై ఈ వ్యాఖ్యలు చేసారు.