ఫిల్మ్ ఛాంబర్‌కు విశాల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తనతో ఎవ్వరూ సినిమాలు చేయొద్దని టీఎఫ్‌పీసీ నిర్ణయించినట్టుగా ఉంది. దీంతో విశాల్ వారికి వార్నింగ్ ఇచ్చాడు. అసలు సినిమాలే తీయని మీరంతా కలిసి నన్ను ఎలా ఆపుతారో చూస్తాను అన్నట్టుగా సవాల్ విసిరాడు. నేను కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే నన్నే ఆపేందుకు ప్రయత్నించండి అని ట్వీట్ వేశాడు.
తమిళ్ హీరో విశాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే మొదట్నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తాడు విశాల్. ఇటీవల తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని విమర్శలు చేసారు.
అయితే ఈ వివాదం పెద్దది అవ్వడంతో, అలాగే విశాల్ నిర్మాత సంఘంలో ఉన్నప్పుడు నిధులు అక్రమంగా వినియోగించారని ఆరోపిస్తూ విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దంటూ తమిళ నిర్మాతల సంఘం భావించింది. నిర్మాత కథిరేసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ నిర్మాత కథిరేసన్ ని, తమిళ నిర్మాత మండలిని డైరెక్ట్ గానే ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు.