Movie News

కీర్తిసురేశ్‌ పెళ్లిలో హీరో విజయ్ సందడి

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీతో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్ సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. కీర్తి తన డ్రీమ్ ఐకాన్ అయిన హీరో విజయ్ పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, కీర్తి సురేశ్ పెళ్లికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన సంప్రదాయంగా తెల్ల చొక్కా మరియు లుంగీ ధరించి కొత్త జంటను ఆశీర్వదించి ఫొటో దిగారు. కీర్తి ఈ క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వధూవరుల కలర్‌ఫుల్ సంప్రదాయ వస్త్రధారణలో పిక్స్ కూడా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాలను కీర్తి “#ForTheLoveOfNyke” ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ కొత్త జీవితంలో అడుగుపెట్టారు. ఆమెకు ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి పెళ్లి వేడుక సందడితో పాటు, పెళ్లి పిక్స్, వెడ్డింగ్ గ్లింప్స్‌ సోషల్ మీడియాలో తెగ చర్చకు వస్తున్నాయి.తాజాగా కీర్తి సురేశ్ బాలీవుడ్‌లో తన తొలి సినిమా బేబిజాన్ తో అడుగుపెట్టింది. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల అవుతోంది.