Monday, December 23, 2024
HomeMovie Newsరైటర్‌గా మారిన నాని

రైటర్‌గా మారిన నాని

- Advertisement -

నేచురల్ స్టార్ నాని రైటర్ మారిపోయారు. చిత్రసీమలోకికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాని..అనుకోని విధంగా హీరోగా మరి ..ప్రస్తుతం వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ‘దసరా’ , హాయ్ నాన్న తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నాని.. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అతడు రైటర్‌గా కూడా మారినట్లు తెలుస్తోంది. నాని ఓ సినిమాకి స్టోరీ లైన్ ఇచ్చారని తెలుస్తోంది. అదే ‘హిట్3’. దీంతో నాని ఇచ్చిన ఆ స్టోరీ లైన్‌తోనే డెవలప్ చేసి శైలేష్ కొలను స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హిట్ ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రెండో భాగంలో అడివి శేష్ లీడ్‌ రోల్‌లో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడాయి. ఇక హిట్ 3లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2 క్లైమాక్స్‌లోనే నాని కేమియో చేశారు. దీని కొనసాగింపుగా పార్ట్ 3లో అర్జున్‌ సర్కార్‌ పాత్రలో నాని నటించనున్నారు. అయితే ఈ సినిమాలో రానా విలన్ పాత్ర పోషిస్తన్నట్లు సమాచారం. అలానే కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సెప్టెంబర్‌లో హిట్ 3 షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందట. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేస్తారని టాక్.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అంతకుముందు వీరి కాంబోలో అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఇక సరిపోదా శనివారంలో నానికి జంటగా ప్రియాంక మోహన్ నటించింది. ఎస్ జే సూర్య ఈ చిత్రంలో విలన్ రోల్‌లో నటించడం విశేషం. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read