Movie News

చీర కట్టులో కుమారి మాములుగా లేదు

2015 సంవత్సరంలో కుమారి 21ఎఫ్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచమైన హెబ్బా పటేల్..మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో కుమారి పాత్రలో హెబ్బా పటేల్ చాలా హాట్ అండ్ బోల్డ్ సీన్లలో మెరిసింది ఈ బ్యూటీ. ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హెబ్బా పటేల్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, మిస్టర్, ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.

అయితే ఈ మధ్యకాలంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించింది హెబ్బా. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా తన కెరీర్ కు ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించి రెండవ భాగం కూడా త్వరలోనే మన అందరి ముందుకి రానుందని సమాచారం. అలాగే హెబ్బా పటేల్ గత సంవత్సరంలో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ ఇప్పటికీ కూడా మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ అండ్ క్యూట్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా హెబ్బా పటేల్ సారీలో మెరిసింది. ఎల్లో కలర్ సారీ కట్టుకొని తన యద అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన హెబ్బా అభిమానులు చాలా అందంగా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.