Movie News

‘నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను” – హరీష్ శంకర్ సీరియస్ వార్నింగ్

‘షాక్’ ఫేమ్ హరీష్ శంకర్..సోషల్ మీడియా లో ఎప్పుడు షాక్ ఇస్తుంటారు. తనకు ఏమనిపిస్తే అది చెప్పేయడం..అది నేయడం ఆయనకు అలవాటు. అవతలి వ్యక్తి ఏమనుకుంటారు..ఇంతపెద్ద వాడు అనేది చూడడు. తనపై అనవసరంగా కామెంట్స్ చేస్తే ఏమాత్రం లెక్క చేయకుండా ఇచ్చిపడేస్తాడు. అందుకే ఆయనంటే అభిమానులకు ఇష్టం. ప్రస్తుతం రవితేజ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. రేపు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ క్రమంలోనే ఓ సోషల్ మీడియాలో ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

“రిలీజ్ దగ్గర పడుతుంది కదా … ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడని… ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది …. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!” అంటూ హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా హరీష్ ఈ వార్నింగ్ ఇచ్చారు. కానీ కామెంట్లలో నెటిజన్లు మాత్రం మీరు ఎవరి గురించి అన్నారో మాకు తెలుసు అంటూ పెడుతున్నారు. నిజానికి హరీష్ శంకర్ చాలా సందర్భాల్లో ఒక జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. తన సినిమాలపై కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తూ సదరు జర్నలిస్టు వార్తలు రాస్తుంటారని హరీష్ అంటుంటారు. ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ ఆ వ్యక్తి గురించే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

రిలీజ్ దగ్గర పడుతుంది కదా …

ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు
అని…

ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది ….

దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!— Harish Shankar .S (@harish2you) July 9, 2024